
క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా సినిమా గురించి ఓ రూమర్ హడావిడి చేస్తుంది. సుక్కు సినిమాలో చెర్రి ఓ చెవిటి వాడిగా కనిపిస్తాడని కొద్దిరోజులుగా వినిపిస్తున్న మాట. హీరో కదా ఏమన్నా ప్రయోగం చేస్తున్నాడేమో అనుకున్నారు ఇక రెండు రోజుల నుండి ఈ సినిమాలో సమంత కూడా డెఫ్ అండ్ డమ్ (చెవిటి,మూగ) పాత్రల్లో కనిపిస్తుందని అంటున్నారు.
ఈ న్యూస్ బయటకు రావడంతో మూగ ప్రేమను తెర మీద చూసేందుకు ప్రేక్షకులు భయపడ్డారు. మెగా ఫ్యాన్స్ అయితే అదో టెన్షన్ పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ అన్నిటిని కొట్టిపడేసేసరికి ఫ్యాన్స్ కాస్త రిలీఫ్ అయ్యారు. సినిమాలో అనుకుంటున్నట్టుగా ఎలాంటి అంగ వైకల్యం ఉండదని. సమంత విలేజ్ లో రిచ్ ఫ్యామిలీ అమ్మాయిగా కనిపిస్తుందని.. బయట వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆమెకు ఎలాంటి లోపం ఉండవని క్లారిటీ ఇచ్చారు. ఇక రీసెంట్ గా ఈ సినిమాలో చెర్రి లుక్ లీక్ అయిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. డిఫరెంట్ సబ్జెక్ట్ తో వస్తున్న సుకుమార్ చరణ్ లు సినిమాతో కచ్చితంగా విజయం సాధిస్తారని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిమ్రిస్తున్న ఈ సినిమాలో అనసూయ కూడా ఓ స్పెషల్ రోల్ ప్లే చేస్తుందట.