దిల్ రాజుని లైన్లో పెడుతున్న తేజ్..!

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ఈమధ్య జోష్ తగ్గించాడని చెప్పొచ్చు. సుప్రీం హిట్ తో మెగా క్రేజ్ దక్కించుకున్న ఈ హీరో ఆ తర్వాత వచ్చిన తిక్క, విన్నర్ రెండు అపజయాలవడంతో సంక్షోభంలో పడ్డాడు. విన్నర్ కోసం సూపర్ హిట్ మూవీ శతమానం భవతి సినిమాను కూడా వదులుకున్న తేజ్ ఈసారి మాత్రం దిల్ రాజు బ్యానర్లో ఎలాంటి సినిమా వచ్చినా మిస్ అయ్యే ఛాన్సే లేదని అంటున్నాడట.

అందుకు ముందుచూపుగా శతమానం భవతికి నేషనల్ అవార్డ్ రావడంతో దిల్ రాజుని ప్రస్తుతం తను చేస్తున్న 'జవాన్' సెట్స్ కి పిలిచి మరి కేక్ కట్ చేయించాడట తేజ్. రాజుని కాక పట్టే పనిలో పడ్డ తేజ్ దానికి తగ్గ ఫలితం కూడా అందుకున్నాడట. శతమానం భవతి డైరక్టర్ సతీష్ వేగేశ్న డైరక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో సాయి ధరం తేజ్ హీరోగా కన్ఫాం అయ్యాడట. సో తేజ్ కు ఓ హిట్ సినిమా స్క్రిప్ట్ దొరికేసినట్టే. శ్రీనివాస కళ్యాణం పేరుతో వస్తున్న ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుందట. ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన మరిన్ని విషయాలు త్వరలో వెళ్లడవుతాయి.