బన్ని డేట్ కు చైతు వస్తాడట..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న దువ్వాడ జగన్నాధం సినిమా అసలైతే మే నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. మే 19న డిజె రిలీజ్ అని ముందునుండి చెప్పుకొచ్చారు. కాని షూటింగ్ కు అనుకోని అవాంతరాలు ఎదురవడం వల్ల బన్ని డిజె జూలై లాస్ట్ వీక్ లో వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. హరీష్ శంకర్ కాంబినేషన్ మొదటి సారి డిజెలో నటిస్తున్న అల్లు అర్జున్ సినిమాలో బ్రాహ్మణ పాత్రలో కనిపిస్తున్నాడు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వాయిదా పడడంతో అదే రోజున అక్కినేని యువ హీరో నాగ చైతన్య నటిస్తున్న రారండోయ్ వేడుక చూద్దాం రిలీజ్ ప్లాన్ చేశారట. సోగ్గాడే చిన్ని నాయనా డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. సమ్మర్ సీజన్ ముగింపు వేళ వచ్చి సర్ ప్రైజ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు చైతు. మరి బన్ని రిలీజ్ డేట్ అయితే ఆక్రమించిన చైతన్య అదే రేంజ్ హిట్ అందుకుంటాదో లేదో చూడాలి.