
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా సెకండ్ పార్ట్ బాహుబలి పార్ట్ 2 ది కన్ క్లూజన్ ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. వెయ్యి కోట్ల కలక్షన్స్ టార్గెట్ తో దేశంలో మొట్టమొదటి సారి ఇది ప్రాంతీయ సినిమా కాదు ఇండియన్ సినిమా అని అందరు కలిసి కట్టుగా చెబుతున్నారు. బాహుబలి మూవీ మొదటి పార్ట్ రెండు గంటల 30 నిమిషాలు చూపించారు. నాలుగు గంటల సినిమా కథను రెండు పార్టులుగా తెరకెక్కించారు రాజమౌళి.
ఇక ఈ సెకండ్ పార్ట్ రెండు గంటల 50 నిమిషాల దాకా ఉండొచ్చని అంటున్నారు. సినిమా అంచనాలను ఏమాత్రం తగ్గకుండా విజువల్ ఫీస్ట్ గా సినిమా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అంచనాలను మించి సంచలనాలను సృష్టించడానికి సిద్ధం అవుతుంది బాహుబలి-2. మరి ఈ సినిమా నెలకొల్పే రికార్డులకు ప్రత్యక్ష సాక్షులుగా ఉండేందుకు మనమంతా సిద్ధంగా ఉందాం.