
ప్రేమకథలను తన క్లాసిక్ టేకింగ్ తో అదిరిపోయేలా తీసే దర్శకుడు మణిరత్నం ఆ విషయంలో ఎవరికి ఏ డౌట్ లేదు. ఓకే బంగారం సినిమాతో ఫాంలో వచ్చాడు అనుకున్న మణిరత్నం రీసెంట్ గా వచ్చిన చెలియా డిజాస్టర్ రిజల్ట్ అందుకున్నాడు. అసలైతే ఈ చెలియా సినిమానే రాం చరణ్ చేయాల్సిందట కాని ఎందుకో కుదరలేదని అంటున్నారు. చెలియా చరణ్ చేయనందుకు ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నా మణిరత్నం తర్వాత సినిమా చరణ్ తోనే అంటూ వార్తలు రావడంతో మళ్లీ మెగా ఫ్యాన్స్ కు టెన్షన్ మొదలైంది.
చెలియా రిలీజ్ కు ముందు మణిరత్నంతో చరణ్ సినిమా తీసే ఆలోచన ఉన్నమాట నిజమే కాని ఆ సినిమా రిజల్ట్ చూశాక కూడా చేస్తా అనడం కాస్త కంగారు పెట్టిస్తుంది. చెర్రి లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో మణిరత్నం మార్క్ క్లాసిక్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ చెర్రి క్యాన్సిల్ చేసుకుంటేనే బెటర్ అన్నది వారి వాదన. ఉగాదికే ఈ కాంబినేషన్ మూవీ ఎనౌన్స్ మెంట్ వస్తుంది అని హడావిడి చేసిన వారంతా ఇప్పుడు చరణ్ ఫైనల్ డెశిషన్ కోసం ఎదురుచూస్తున్నారట.