
మెగా హీరో వరుణ్ తేజ్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో అదిరి పోయే షాకింగ్ న్యూస్ చెప్పాడు వరుణ్ తేజ్. ఇంతకీ ఏంటి ఆ న్యూస్ అంటే.. తన దగ్గరకు వచ్చిన ఈ సబ్జెక్ట్ బన్నినే తనకు సజెస్ట్ చేశాడని అన్నాడు. అంటే శ్రీనువైట్ల ఈ సినిమాను అల్లు అర్జున్ తో తీద్దామని అనుకున్నాడా అని అందరు షాక్ అవుతున్నారు.
సరైనోడుతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న బన్ని శ్రీనువైట్లతో కథా చర్చల్లో పాల్గొన్నాడట. అయితే కెరియర్ మొదట్లో లవ్ స్టోరీస్ చేసిన బన్ని ఇప్పుడు ఇమేజ్ పెరిగింది కాబట్టి ఆ కథకు వరుణ్ అయితే బాగుంటాడని అన్నాడట. అంతేకాదు ఆగడు, బ్రూస్ లీ ఫ్లాపులతో వెనుకపడ్డ శ్రీను వైట్లతో చేసే ఇంట్రెస్ట్ లేక బన్ని ఈ సబ్జెక్ట్ ను వరుణ్ కు షిఫ్ట్ చేశాడని అంటున్నారు. నల్లమలపు శ్రీనివాస్ ఠాగూర్ మధు కలిసి నిర్మించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, హెబ్భా పటేల్ హీరోయిన్స్ గా నటించారు.