
ఈ కాలం కుర్ర హీరోలంతా మెగాస్టార్ ను చూసి స్పూర్తి పొంది హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారే. వారిలో నాచురల్ స్టార్ నాని కూడా ఉన్నాడు. మొదట దర్శకత్వ శాఖలో పనిచేసినా తన ఫైనల్ గోల్ హీరో అవ్వాలనే అట.. ఇంద్రగంటి వల్ల ఆ అదృష్టం తలుపు తట్టడంతో వెంటనే ఒప్పేసుకుని ఫైనల్ గా నాచురల్ స్టార్ గా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. మరి మెగాస్టార్ స్పూర్తితో హీరోగా మారిన నాని అదే మెగాస్టార్ ముందు హాట్ సీట్ లో కూర్చుంటే. అదేనండి మీలో ఎవరు కోటిశ్వరుడు ఈవారం గెస్ట్ గా నానిని ఇన్వైట్ చేశారు.
నాని చిరు సరదా సంభాషణలతో సాగిన ఎం.ఈ.కెలో చిరంజీవి తనకు ఓ సైకిల్ బాకీ ఉన్న విషయాన్ని బయట పెట్టాడు. చిరు ఏంటి నానికి సైకిల్ బాకీ ఏంటి అంటే.. మెగాస్టార్ మూవీ మాస్టర్ రిలీజ్ టైంలో సత్యం థియేటర్ దగ్గర తన సైకిల్ పెట్టి టికెట్ పోటీ పడి మరి కొనుకున్నాడట నాని. టికెట్ దొరికిన ఆనందంలో సైకిల్ గురించి పెద్దగా పట్టించుకోలేదట. ఇక సినిమా అయ్యాక వచ్చి చూస్తే సైకిల్ పోయిందని తెలుసుకున్నాడట. ఈ మొత్తం స్టోరీ ఇంట్లో చెప్పకుండా ఏదో చెప్పి మ్యానేజ్ చేశాడట.
ఇక ఇదే విషయం అల్లు అరవింద్ గారితో భలే భలే మగాడివోయ్ సినిమా చేస్తున్న టైంలో చెప్పానని.. కాని అరవింద్ గారు కొనివ్వలేదని ఎం.ఈ.కెలో అందరి ముందు ఆ సైకిల్ మీరు కొనివ్వాలని అన్నాడు నాని. నాని అడిగిన సైకిల్ తాను కచ్చితంగా కొనిస్తానని అన్నాడు మెగాస్టార్. అలా నాని సైకిల్ బాకీ తీర్చేలా ప్లాన్ చేశాడు చిరు. మొత్తానికి ముందు కాస్త అటు ఇటుగా స్టార్ట్ అయిన చిరు ఎం.ఈ.కె ఇప్పుడిప్పుడే గాడిలో పడ్డట్టు కనిపిస్తుంది.