
సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో తెలిసిందే. సినిమా స్టార్ట్ అయ్యి 10 నెలలు అవుతున్నా సినిమాకు సంబందించి ఎలాంటి క్లూ బయటకు లీక్ కానివ్వలేదు. అంతేనా సినిమా జూన్ 23న రిలీజ్ అని ఎనౌన్స్ చేశారే తప్ప కనీసం టైటిల్ కూడా కన్ఫాం చేయలేదు. ఆ ఆవేశంతోనే మహేష్ ఫ్యాన్స్ మురుగదాస్ ను తిట్టిపోశారు.
ఫైనల్ గా అభిమానుల ఎదురుచూపులకు కానుకగా ఏప్రిల్ 12 సాయంత్రం 5 గంటలకు మహేష్ మురుగదాస్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారు. చిత్రయూనిట్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేసిన ఈ న్యూస్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాదు ఏప్రిల్ 14 తమిళ సంవత్సరాది కానుకగా టీజర్ కూడా రిలీజ్ చేస్తారని టాక్. ఠాగూర్ మధు ఎన్వీ ప్రసాద్ లు నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ స్పైడర్ అని ప్రచారం జరుగుతుంది. మరి ఆ టైటిల్ కన్ఫాం అవ్వాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.