మెగాస్టార్ ఛాన్స్ పట్టేసిన థమన్..!

ఖైది నంబర్ 150తో మరోసారి తన సత్తా చాటిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151వ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ తో వస్తున్న చిరంజీవి ఆ సినిమాకు మ్యూజిక్ అందించేందుకు థమన్ ను సెలెక్ట్ చేసుకున్నారట. ఈ విషయం థమన్ తన ట్విట్టర్ పేజ్ లో ఎనౌన్స్ చేయడం విశేషం.   

సురేందర్ రెడ్డి థమన్ లది సూపర్ హిట్ కాంబినేషన్.. కిక్ సినిమాతో థమన్ మ్యూజిక్ డైరక్టర్ గా ఛాన్స్ ఇచ్చిన సురేందర్ రెడ్డి రేసుగుర్రంతో కూడా హిట్ అందుకున్నాడు. ఇక చిరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి కూడా థమన్ మ్యూజిక్ అందించనున్నాడట. నా కిక్.. నా రేసుగుర్రం.. అని ట్వీట్ చేసి నా నెక్ష్ట్ ఏంటి.. అని చిరుతో ఉన్న పిక్ ట్వీట్ చేశాడు. మరి థమన్ మ్యూజిక్ తో ఉయ్యాలవాడ సినిమా ఎలాంటి అవుట్ పుట్ ఇస్తుందో చూడాలి.