
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ అటు ఓ పక్క స్మాల్ స్క్రీన్ పై తన హవా కొనసాగిస్తూనే మరో పక్క సిల్వర్ స్క్రీన్ మీద కూడా రెచ్చిపోతుంది. రీసెంట్ గా విన్నర్ మూవీలో సూయ సూయ ఐటంతో అలరించిన అనసూయ ఆ సాంగ్ తో మరో క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుందని అంటున్నారు. ఇంతకీ అనసూయ అందుకున్న ఆఫర్ ఎవరిది అంటే ఇంకెవరిది మెగా పవర్ స్టార్ రాం చరణ్ సినిమా అని తెలుస్తుంది.
సుకుమార్ డైరక్షన్ లో రాం చరణ్ నటిస్తున్న సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా ఓ క్రేజీ పాత్రలో అనసూయ కూడా కనిపించనుందట. చరణ్ తో ఛాన్స్ అందుకున్నందుకు అనసూయ ఆనందానికి అవధుల్లేవని అంటున్నారు. యాంకర్ నుండి యాక్టర్ గా అవతారం ఎత్తిన అనసూయ చెర్రి సినిమాలో చేసే పాత్ర క్లిక్ అయితే కనుక ఇక ఆమెకు తిరుగు ఉండదని చెప్పొచ్చు. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.