
ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 రిలీజ్ అవుతుందని తెలిసిందే. మొదటి పార్ట్ ఎంతటి సంచలనాలను సృష్టించిందో అంతకంటే ఎక్కువ అంచనాలతో రికార్డుల టార్గెట్ తో వస్తుంది బాహుబలి-2. తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన చిత్రయూనిట్ నిన్న చెన్నైలో తమిళ ఆడియో రిలీజ్ చేసింది. ధనుష్ అతిధిగా వచ్చిన ఈ ఆడియో వేదిక మీద రాజమౌళి స్పీచ్ తమిళ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేలా చేసింది.
ఏదో ఒక రోజు రజినితో సినిమా చేస్తా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరిని ఇంప్రెస్ చేశాడు రాజమౌళి. బాహుబలి బిగినింగ్ లో కేవలం పాత్రల పరిచయం మాత్రమే చేశామని.. అసలు డ్రామా ఈ పార్ట్ లోనే ఉంటుందని అన్నారు. సినిమా కోసం తనతో పాటు కష్టపడ్డ చిత్రయూనిట్ అందరికి థాంక్స్ చెప్పారు రాజమౌళి. ఇక చిన్నప్పుడు వై.ఎం.సి.ఏ గ్రౌండ్స్ లో తను ఈత కొట్టిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు రాజమౌళి.