నిర్మాత లవ్ లో హీరోయిన్.. డైరెక్ట్ గా చెప్పేసింది..!

డైరక్టర్ ఎంత క్రియేటివ్ గా ఆలోచించి సినిమాలు తీసినా ఆ సినిమా తెరకెక్కించాలంటే దానికి కావాల్సింది నిర్మాతే. అందుకే టాలీవుడ్ క్రేజీ బ్యూటీ కుమారి హెబ్భా పటేల్ ఏకంగా నిర్మాతకే ఐలవ్యూ చెప్పేసింది. ఏంటి కామెడీ అనుకుంటున్నారా ఇదంతా నిజమే.. రీసెంట్ గా జరిగిన మిస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హెబ్భా పటేల్ ఆ సినిమా నిర్మాత నల్లమలపు శ్రీనివాస్ అలియా బుజ్జికి ఐలవ్యూ చెప్పేసింది.

సాధారణంగా సహ నటులైన హీరోలతో తమకున్న బాండింగ్ తో ఐలవ్యూ అని చెబితే అది కామన్ అనుకోవచ్చు కాని ఓ నిర్మాతని అది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఐలవ్యూ చెప్పడం అందరిని ఆశ్చర్యం వేసింది. పక్కనే ఉన్న యాంకర్ కూడా నిర్మాతకు ఐలవ్యూ చెప్పిన హీరోయిన్ బహుశా ఇదే మొదటి సారి కావొచ్చని అన్నది. హెబ్భా ప్రపోజల్స్ కు నల్లమలపు శ్రీనివాస్ ఆ సమయంలో కాస్త ఇబ్బంది పడ్డాడని అతన్ని చూస్తే అర్ధమవుతుంది. ఏది ఏమైనా ఎవరిని ఎక్కడ కొట్టాలో బాగా తెలిసిన హెబ్బా నల్లమలపు శ్రీనివాస్ కు ఐలవ్యూ చెప్పడం టాలీవుడ్ లో హాట్ న్యూస్ గా మారింది.