
రీసెంట్ గా ప్రకటించిన జాతీయ అవార్డులు కొందరిని బాధపెట్టినట్టు ఉన్నాయి. అందుకే అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ లో కొందరు ప్రముఖులు ఈ అవార్డుల మీద అసహనం వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం ఈ అవార్డుల మీద తన అసంతృప్తిని వెళ్లగక్కాడు కోలీవుడ్ క్రేజీ డైరక్టర్ మురుగదాస్. అవార్డుల ఎంపికలో పక్షపాతం వ్యవహరించారని అన్న మురుగదాస్ జ్యూరీలో ఉన్న వారి అభిప్రాయం మేరకే వారికి నచ్చిన వారికే అవార్డులు అందించారని అంటున్నాడు.
మురుగదాస్ డైరెక్ట్ గా చెప్పక పోయినా అతని టార్గెట్ చేసింది జ్యూరీలో ఉన్న ప్రియదర్శన్ నే అని అందరు అంటున్నారు. ప్రియదర్శన్ తో సినిమాలు చేశాడు కాబట్టి అక్షయ్ కుమార్ కు ఉత్తమ నటుడు అవార్డ్ వచ్చిందని.. ఇక ప్రియదర్శన్ కు అత్యంత సన్నిహితుడే కాబట్టి మోహన్ లాల్ కు ప్రత్యేక జ్యూరీ వచ్చిందని అంటున్నారు. ఎక్కువగా మలయాళ సినిమాలకు నేషనల్ అవార్డ్ రావడానికి కారణం కూడా ప్రియదర్శన్ కారణమని అభిప్రాయపడుతున్నారు.