
సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా పూర్తి కాగానే వెంటనే మహేష్ కొరటాల శివతో భరత్ అను ఏను సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఎన్నాళ్ల నుండో వెయిటింగ్ లో ఉన్న వంశీ పైడిపల్లితో కూడా మహేష్ సినిమా కన్ఫాం అయ్యింది. ఈ సినిమా కథలో ఓ స్పెషల్ రోల్ అల్లరి నరేష్ తో చేయించాలని చూస్తున్నారట.
కామెడీ హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్న అల్లరోడు ఈమధ్య కాస్త వెనుకపడ్డాడు. అయితే వంశీ రాసుకున్న కథలో నరేష్ లాంటి ఇమేజ్ ఉన్న హీరో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తే బాగుంటుంది అని చూస్తున్నాడట. ఇప్పటికే మహేష్ దీనికి ఓకే అనగా అల్లరి నరేష్ తో కథా చర్చలు నడిపిస్తున్నారట. ఒకవేళ అల్లరోడు కూడా ఓకే అంటే ఆ పాత్రకే కాదు సినిమాకు స్పెషల్ క్రేజ్ వచ్చేసినట్టే. మరి ఈ ప్రాజెక్ట్ పై అఫిషియల్ స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.