ఆ హిట్ కాంబినేషన్ రిపీట్..!

మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమం ను అదే రేంజ్ లో తెలుగులో రిజల్ట్ వచ్చేలా చేశాడు దర్శకుడు చందు మొండేటి. నాగ చైతన్య హీరోగా వచ్చిన ఆ సినిమా హిట్ అవ్వడమే కాకుండా కార్తికేయ తర్వాత చందు మరోసారి తన ప్రతిభ చాటుకున్న సినిమా అయ్యింది. ఇక ప్రేమం చూసి పరవశించిన కింగ్ నాగార్జున చందు మొండేటి డైరక్షన్ లో సినిమా చేసేందుకు సై అన్నాడు.

చందు కూడా నాగార్జునను సరిపడే స్క్రిప్ట్ సిద్ధం చేశాడని అన్నారు. మధ్యలో ఏమైందో ఏమో మరోసారి చందు నాగ చైతన్య హీరోగా సినిమా తీయలని ఫిక్స్ అయ్యాడట. ఈమధ్యనే చైతుని కలిసి ఓ కథ చెప్పాడట. ఇంతవరకు తెలుగులో అలాంటి కథ రాలేదట. మొత్తం స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీగా కొత్త అటెంప్ట్ అవుతుందని చైతు వెంటనే ఓకే చెప్పాడత. మరి క్రేజీ హిట్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా అఫీషియల్ కన్ ఫర్మేషన్ ఎప్పుడో చూడాలి.