
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మిస్టర్ సినిమా శ్రీనువైట్ల డైరక్షన్ లో వస్తుంది. లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కి జె మేయర్ మ్యూజిక్ అందించారు. ఏప్రిల్ 14న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి అతిధిగా వచ్చిన మిస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మేఅ ఫ్యాన్స్ హంగామాతో సరదాగా సాగింది.
మిస్టర్ కు విశెష్ అందించేందుకు వచ్చిన మెగాస్టార్ శ్రీనువైట్లకు ఈ సినిమా తప్పక సక్సెస్ అందించాలని అన్నారు. ఇక మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఉన్నా సొంత టాలెంట్ తో కష్టపడి పైకి రావాలని వరుణ్ తేజ్ కు చెప్పానని.. అదేవిధంగా అతని సినిమాల సెలక్షన్ కూడా బాగున్నాయని అన్నారు. ఇక నిర్మాతలిద్దరు తనకు బాగా తెలుసని.. ఒకరు కాస్టింగ్ చూస్తే మరొకరు ప్రొడక్షన్ చూస్తారని మంచి అండర్ స్టాండింగ్ ఉన్న ప్రొడ్యూసర్స్ అని అన్నారు. సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకున్నారు చిరంజీవి.