అవసరాలకు పెద్ద పంచ్..!

బాలీవుడ్ అడల్ట్ కంటెంట్ తో వచ్చిన సినిమా హంటర్.. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో అవసరాల శ్రీనివాస్ హీరోగా బాబు బాగా బిజీ సినిమా చేస్తున్నారు. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమా ఏప్రిల్ రెండో వారంలో వస్తుంది. సినిమా టీజర్ ట్రైలర్ బాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తగ్గని విధంగా ఫుల్ అడల్ట్ డోసేజ్ తో నింపేశారు.

అయితే ఇన్నాళ్లు సపోర్టెడ్ రోల్స్ చేస్తూ వచ్చిన అవసరాల శ్రీనివాస్ సినిమా ట్రైలర్ వచ్చాక తన సన్నిహితులతో ఇబ్బంది పడుతున్నాడట. తనకు సపోర్ట్ గా నిలుస్తారు అనుకున్న వారు కూడా ఇలాంటి సినిమా హీరోగా చేయడం ఏంటని అడుగుతున్నారట. సినిమా ట్రైలర్ జనాల్లోకి వెళ్లడం దర్శక నిర్మాతలను ఖుషి అయ్యేలా చేస్తున్నా అవసరాల శ్రీనివాస్ మాత్రం హ్యాపీగా లేడట. మరి సినిమా కమిట్ అయినప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించి ఉండడా అని అంటున్నారు కొందరు. ఏది ఏమైనా అవసరాల శ్రీనివాస్ కు బాబు బాగా బిజీ సినిమా రొమాంటిక్ ఇమేజ్ తీసుకు రావడం ఖాయమని చెప్పొ చ్చు.