
సిని ప్రేక్షకులను తన వయ్యారాలో షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ సన్ని లియోన్ ఇప్పుడు సౌత్ సినిమాల మీద కూడా దృష్టి పెట్టింది. ఆమె క్రేజ్ క్యాష్ చేసుకునే క్రమంలో తెలుగు దర్శక నిర్మాతలు సన్ని కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం సన్ని ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ నటిస్తున్న గరుడవేగలో స్పెషల్ సాంగ్ చేస్తుంది.
ముంబైలో షూట్ చేస్తున్న ఈ సాంగ్ కోసం భారీ సెట్ వేశారట. ఈ సాంగ్ కోసం సన్నికి కోటి దాకా ఇచ్చారని టాక్. అదే కాకుండా సన్ని సోయగాలను చూపించేందుకు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ విష్ణు దేవాని ఈ సాంగ్ కంపోజ్ చేస్తున్నాడట. అతనికి కూడా భారీ రెమ్యునరేషనే ముట్టిందట. సో ఈ లెక్కన సన్ని సాంగ్ కోసం భారీగానే ఖర్చు పెట్టి బడ్జెట్ పెంచేశారట దర్శక నిర్మాతలు. మరి అనుకున్నట్టుగా సాంగ్ క్లిక్ అయితే అంతకు డబుల్ ట్రిపుల్ వసూలు చేయడం కన్ఫాం అనుకోండి. మొత్తానికి సన్ని సాంగ్ రాజశేఖర్ గరుడవేగ సినిమా బడ్జెట్ మీద ప్రభావం చూపించిందన్నమాట.