వెంకటేష్ ను టార్గెట్ చేశాడా..!

టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ కు ఓ సెపరేట్ క్రేజ్ ఇమేజ్ ఉన్నాయి. తన సినిమా కాకపోయినా పరిశ్రమ కోసం ఎన్నో మంచి మంచి సలహాలు ఇచ్చి సినిమా సక్సెస్ లో భాగమయ్యే మంచి మనసు వెంకీది. కొద్దిరోజులు ఫ్యామిలీ సినిమాలతో ఫ్యాన్స్ ను అలరించిన వెంకటేష్ మళ్లీ తన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో అలరిస్తున్నాడు.

బాబు బంగారం రీసెంట్ గా వచ్చిన గురు రెండు వెంకీ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తున్నాయి. ఇక ఇలాంటి టైంలో వెంకటేష్ ను టార్గెట్ చేస్తున్నాడు డైరక్టర్ శ్రీనువైట్ల. వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న మిస్టర్ సినిమాలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వితో లక్ష్మి తులసి పాత్ర వేయిస్తున్నాడట శ్రీనువైట్ల. వెంకటేష్ నటించిన లక్ష్మి, తులసి టైటిల్స్ తో ఆ క్యారక్టర్ డిజైన్ చేసిన శ్రీనువైట్ల వెంకీని ఈ విధంగా టార్గెట్ చేశారని అంటున్నారు. వెంకటేష్ తో శ్రీనువైట్ల నమో వెంకటేశాయ సినిమా తీశాడు. మరి వెంకటేష్ ను ఇమేజ్ వాడుకుని హిట్ కొట్టాలన్న శ్రీనువైట్ల కోరిక ఫలిస్తుందో లేదో చూడాలి.