
అన్నపూర్ణ క్యాంటిన్ అనగానే అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న క్యాంటిన్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇక్కడ క్యాంటిన్ ప్రస్థావన వచ్చింది అది కాదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమాలో అతను చేసే పని అన్నపూర్ణ క్యాంటిన్ లోనే అట. అక్కడ వంట మాస్టర్ గా ఉంటూ అండర్ కవర్ కాప్ గా దుమ్ముదులిపేస్తాడట.
ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతున్న ఈ స్టోరీ హరీష్ శంకర్ డైరక్షన్ లో దువ్వాడ జగన్నాధం స్టోరీ అని అంటున్నారు. టీజర్ తో సూపర్ సెన్సేషనల్ గా మారిన డిజె ఈ సమ్మర్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.