
సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ సినిమా పూర్తి కాగానే గ్యాప్ ఎక్కువ తీసుకోకుండా మహేష్ కొరటాల శివ సినిమా మొదలు పెట్టనున్నాడు. లండన్ లో మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేయనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ కియరా అద్వానిని సెలెక్ట్ చేశారని టాక్.
ఎం.ఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీలో దిశా పటానితో పాటు కియరా అద్వాని కూడా ప్రేక్షకులను అలరించింది. ధోని ఒరిజినల్ రోల్ ప్లే చేసిన ఈ అమ్మడు తన టాలెంట్ చూపించింది. ఇక ఆ ప్రతిభతోనే కొరటాల శివ మహేష్ పక్కన సెలెక్ట్ చేశారట. భరత్ అనే నేను టైటిల్ ప్రచారంలో ఉన్న సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడట. 2018 సంక్రాంతి టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా శ్రీమంతుడు మ్యాజిక్ రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.