
సౌత్ లో క్రేజీ డైరక్టర్స్ లిస్ట్ లో కచ్చితంగా మురుగదాస్ పేరు ఉంటుంది. తెలుగు తమిళ భాషల్లో తన మార్క్ సినిమాలతో సినిమాలు రూపొందిస్తున్న మురుగదాస్ ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తో స్పైడర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి సత్తా చాటాలని చూస్తున్న మురుగదాస్ సినిమా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మీద ఇష్టం పెంచుకున్నాడట.
గత ఆరునెలల నుండి రకుల్ తో ప్రయాణం చేస్తుండటంతో ఆమె డెడికేషన్ నచ్చిన దాస్ మహేష్ తర్వాత తమిళంలో విజయ్ తో చేయనున్న సినిమాలో హీరోయిన్ గా ఆమెనే ఫైనల్ చేశాడని టాక్. విజయ్ తో మురుగదాస్ సినిమా అంటే ఇప్పటికే తుపాకి, కత్తి రెండు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక వాటి లానే హ్యాట్రిక్ కాంబోలో రాబోతున్న ఈ మూవీలో రకుల్ ఛాన్స్ కొట్టేయడం ఓ సూపర్ హిట్ మూవీకి అవకాశం దక్కినట్టే. అయితే ఇప్పటికే కమిట్ అయిన సినిమాల డేట్స్ అడ్జెస్ట్ చేసిన రకుల్ మురుగదాస్ కోసం ప్రత్యేకించి డేట్స్ అడ్జెస్ట్ చేయాలని తన మేనేజర్ కు చెబుతుందట.