
బాహుబలి-2 ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సందర్భంలో ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే కాదు మరోసారి మొదటి పార్ట్ ను ప్రేక్షకులకు చూపించేలా బాహుబలి బిగినింగ్ ను రి రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే రి రిలీజ్ చేసేది మాత్రం కేవలం హింది వర్షన్ మాత్రమే. కరణ్ జోహార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్.
ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ చేసి ప్రమోట్ చేస్తూ ఏప్రిల్ 28న బాహుబలి-2 ని గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ అని తెలిసినా మరోసారి బాహుబలి బిగినింగ్ థియేటర్ ఫీల్ తో చూడాలని అనుకునే వారు రి రిలీజ్ చూసే అవకాశం ఉంది. రి రిలీజ్ అని ఏదో కాజువల్ గా కాకుండా భారీగా పోస్టర్స్ గట్రా రిలీజ్ చేసి దీనికి ప్రమోషన్స్ కూడా చేస్తున్నట్టు టాక్. మరి ఓ తెలుగు సినిమా హింది వర్షన్ మరోసారి రిరిలీజ్ అవడం నిజంగా బాహుబలికే దక్కినే క్రిడేట్ అని చెప్పొచ్చు.