
విక్టరీ వెంకటేష్ నటించిన గురు సినిమా సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది. సాలా ఖడూస్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. తమిళ హింది వర్షన్ లాస్ట్ ఇయర్ సూపర్ హిట్ అవ్వగా ఆ సినిమా చేయడానికి ముందే తెలుగులో వెంకటేష్ ను అడిగిందట డైరక్టర్ సుధ కొంగర. అయితే అప్పుడు తన తీస్తున్న సినిమాల బిజీ వల్ల వెంకటేష్ ఆ సినిమా మీద అంత కాన్సెంట్రేట్ చేయలేకపోయాడట.
వెంకీ కాదనడంతో తమిళ హింది భాషల్లో తెరకెక్కించగా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక అదే సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచన రాగా అప్పుడు రానాతో తీసేందుకు ప్లాన్ చేశారట దర్శక నిర్మాతలు. బాహుబలి భళ్లాలదేవగా అదరగొట్టిన రానా గురుగా కూడా ఇంప్రెస్ చేయగలడని అనుకున్నారట. కాని ఈలోగా మళ్లీ వెంకటేష్ గురు మీద ఇంట్రెస్ట్ చూపించడంతో వెంకటేష్ తోనే చేశారట దర్శక నిర్మాతలు. మొత్తానికి గురుగా దగ్గుబాటి వెంకటేష్ మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు.