
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాబి డైరక్షన్ లో వస్తున్న జై లవ కుశ సినిమా టైటిల్ లోగో ఈరోజు రిలీజ్ అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ ఎవరితో సినిమా తీస్తాడన్న కన్ ఫ్యూజన్ ఇప్పటినుండే స్టార్ట్ అయ్యింది. అసలైతే బాబి సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రం తో ఎన్.టి.ఆర్ సినిమా పక్కా అని అన్నారు. కాని మళ్లీ రేసులోకి మరో ఇద్దరు దర్శకులు వచ్చారు.
ఇండియన్ ఎపిక్ మూవీతో ప్రపంచ మత్తా తన సత్తా గురించి తెలిసేలా చేసుకున్న రాజమౌళి బాహుబలి-2 తర్వాత ఎన్.టి.ఆర్ తోనే సినిమా చేస్తాడని అంటున్నాడట. బాహుబలి-2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉన్న జక్కన్న ఈలోపు తారక్ బాబి సినిమా పూర్తి కాగానే సినిమా స్టార్ట్ చేస్తాడని అంటున్నారు. ఇక తారక్ డైరక్టర్స్ రేసులో వినాయక్ కూడా ఉన్నాడని తెలుస్తుంది.
ఖైది నంబర్ 150 తర్వాత వినాయక్ స్టార్స్ సినిమా చేసే అవకాశం లేకుండా అందరు బిజీ అయ్యారు. అందుకే కాస్త టైం తీసుకున్న వినాయక్ మరోసారి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా తీయాలని చూస్తున్నాడట. అదుర్స్ లాంటి అదిరిపోయే కథతో మరోసారి ఇద్దరు కలిసి పనిచేయాలని చూశారు కాని కుదరలేదు. మరోసారి మాస్ కమర్షియల్ మూవీతో వినాయక్ డైరక్షన్ లో సినిమా చేయాలని చూస్తున్నాడు ఎన్.టి.ఆర్.