
తన మెలోడీ సంగీతంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న సంగీత దర్శకుడు మిక్కి జె మేయర్. కుర్ర హీరోల సినిమాల నుండి స్టార్ సినిమాలకు మ్యూజిక్ అందించేలా క్రేజ్ సంపాదించిన మిక్కి జె మేయర్ ఇప్పుడు ఓ ప్రెస్టిజియస్ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం దక్కించుకున్నాడట.
మహానటి సావిత్రి బయోపిక్ గా వస్తున్న మహానటి సినిమాకు మ్యూజిక్ అందించే లక్కీ ఛాన్స్ అందుకున్నాడట మిక్కి జే మేయర్. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మహానటిగా కీర్తి సురేష్ నటిస్తుండగా సమంత కూడా ఓ ప్రత్యేక పాత్రలో మెరుస్తుందని టాక్. అశ్వనిదత్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో నిర్మించబడుతుంది. మరి మహానటిలో మ్యూజిక్ అందించే అవకాశం దక్కించుకున్న మిక్కి ఆ సినిమాకు ఎలాంటి సూపర్ హిట్ మ్యూజిక్ అందిస్తాడో చూడాలి.