
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న దువ్వాడ జగన్నాధం. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పూర్తి కాగానే వక్కంతం వంశీ డైరక్షన్ లో నా పేరు సూర్య సినిమా చేస్తున్నాడు. లగడపాటి శిరీష శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందట.
అందుకే సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మికను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. కన్నడలో కిరాక్ పార్టీ సినిమాలో హీరోయిన్ గా నటించి ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించిన రష్మిక మిగతా భాషల దర్శక నిర్మాతలను ఎట్రాక్ట్ చేస్తుంది. బన్నికి జోడిగా రష్మికను ఫైనల్ చేసినట్టు టాక్. టాలీవుడ్ లో హీరోయిన్స్ కు సూపర్ క్రేజ్ ఉంటుంది. మరి బన్ని సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రష్మిక ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకుంటుందని అంటున్నారు.