లండన్ లో స్టార్ట్ చేస్తున్న మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ మూవీ పూర్తి కాగానే శ్రీమంతుడు కాంబినేషన్ లో కొరటాల శివతో మూవీ స్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ముహుర్తం పెట్టుకున్న ఈ సినిమా మే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారట. సినిమాలో రిటర్న్ ఎన్నారైగా మహేష్ నటించనున్నాడట. 

భరత్ అను నేను టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ లండన్ లో స్టార్ట్ చేస్తారట. అక్కడ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశాడట కొరటాల శివ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 100 కోట్ల దాకా ఉంటుందని టాక్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా శ్రీమంతుడు కన్నా భారీ హిట్ అందుకుంటుందని డైరక్టర్ కొరటాల శివ గట్టి నమ్మకంగా ఉన్నాడు. 2018 సంక్రాంతికి రిలీజ్ అవనున్న ఈ సినిమా మహేష్ అభిమానులను ఏమేరకు అలరించనుందో చూడాలి.