ఎన్టీఆర్ 'జై లవ కుశ' టైటిల్ లోగో..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న జై లవ కుశ సినిమా టైటిల్ లోగో కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేశారు. తారక్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా జై లవ కుశ టైటిల్ లోగో లాంచ్ చేశారు.

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్.టి.ఆర్ ఏరి కోరి ఎంచుకున్న ఈ సబ్జెక్ట్ కచ్చితంగా అదే రేంజ్ రిజల్ట్ ఇస్తుందని అంటున్నారు. సమంత, రాశి ఖన్నా హీరోయిన్స్ గా ఫైనల్ కాగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ తర్వాత బాబి చేస్తున్న ఈ సినిమా మీద టైటిల్ లోగోతోనే అంచనాలు ఏర్పడేలా చేశారు. అయితే టైటిల్ లుక్ లో సినిమా కాస్త ఫ్యాంటసీ అప్పీల్ తెప్పిస్తుంది మరి అసలు సీక్రెట్ ఏంటి అన్నది సినిమా వస్తేనే కాని చెప్పలేం.