చిరు సినిమాలో వెంకటేష్..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దాదాపు కన్ఫాం అయినట్టే. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుందట. ఇక ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నాడని టాక్. రీసెంట్ గా గురు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్ ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా చేస్తున్న మీలో ఎవరు కోటిశ్వరుడుకి గెస్ట్ గా వచ్చాడు.

వారి సంభాషణలు చూస్తే చిరు 151వ సినిమాలో వెంకటేష్ కూడా ఉంటాడని తెలుస్తుంది. అసలైతే చిరు 150వ సినిమా ఖైది నంబర్ 150లో సల్మాన్, వెంకటేష్ ఓ పాటలో సర్ ప్రైజ్ ఇద్దామని రాం చరణ్ తో డిస్కస్ చేశాడట. కాని ఎందుకో అది కుదరలేదని తెలుస్తుంది. గురుతో వెంకటేష్, ఖైది నంబర్ 150తో చిరు ఇలా ఇద్దరు సూపర్ హిట్ లతో ఫాంలో ఉండగా ఇద్దరు కలిసి నటించే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇంకెలా ఉండబోతుందో చూడాలి.