
బాహుబలి సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు భారతీయ సిని ప్రియులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే సినిమాను ప్రేక్షకులకు త్వరగా అందించే క్రమంలో రాజమౌళి ట్రైలర్ లో పెద్ద పొరపాటే చేశాడని తెలుస్తుంది. మొదటి పార్ట్ లో బిజ్జలదేవ కుడిచేయి అవిటిదిగా ఉంటుంది. ఇక సెకండ్ పార్ట్ ట్రైలర్ లో ఆవేశంతో బిజ్జలదేవ కుడిచేత్తో గోడని పగలకొడతాడు. అంటే మొదటి పార్ట్ కుడిచేయి అవిటిగా ఉన్న బిజ్జలదేవ సెకండ్ పార్ట్ లో ఎడమచేయి అవిటిదిగా కనిపిస్తుందని అంటున్నారు.
ఈ విషయం సోషల్ మీడియా ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారింది. మొదటి పార్ట్ సెకండ్ పార్ట్ కు క్లారిటీ మిస్ అయ్యాడా లేక కన్ ఫ్యూజన్ లో అలా చేశారో తెలియదు కాని రాజమౌళి బాహుబలి-2 లో ఇదో బ్లెండర్ మిస్టేక్ కాబోతుందని అంటున్నారు. ప్రతి చిన్న విషయాన్ని క్లియర్ గా చూసుకునే జక్కన్న బిజ్జలదేవ విషయంలో ఎందుకింత తప్పు చేశాడని ఆశ్చర్యపోతున్నారు. మరి చిత్రయూనిట్ దీనికి ఏ విధమైన క్లారిటీ ఇస్తుందో చూడాలి.