సర్ ప్రైజ్ చేస్తున్న రవితేజ లుక్..!

మాస్ మహరాజ్ రవితేజ ఏడాదిన్నర పైగా గ్యాప్ తీసుకుని మళ్లీ వరుస సినిమాలు చేస్తున్నాడు. విక్రం సిరి డైరక్షన్ లో టచ్ చేసి చూడుతో పాటుగా అనీల్ రావిపుడి డైరక్షన్ లో రాజా ది గ్రేట్ సినిమా చేస్తున్నాడు రవితేజ. కిక్-2 ఫ్లాప్ తర్వాత బెంగాల్ టైగర్ సినిమా పర్వాలేదనిపించినా ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తో ఫ్యాన్స్ కు దూరమైన రవితేజ ఒకేసారి రెండు సినిమాలతో వస్తున్నాడు.

ఈమధ్య కాస్త ఫేస్ లో గ్లామర్ తగ్గినట్టు కనిపించిన రవితేజ అనీల్ రావిపుడి డైరక్షన్ లో రాజా ది గ్రేట్ సినిమా షూటింగ్ స్పాట్ లో పిక్ ఒకటి రివీల్ అయ్యింది. ఆ ఫోటో మాస్ మహరాజ్ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేయడమే కాదు రవితేజలో మళ్లీ ఇదవరకు ఎనర్జీ కనిపిస్తుందని చెప్పొచ్చు. తీసిన రెండు సినిమాలతోనే మాస్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న అనీల్ రావిపుడి అసలు సిసలైన మాస్ మహరాజ్ తో చేస్తున్న రాజా ది గ్రేట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.