అతడు + అదుర్స్ = డిజె..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా దువ్వాడ జగన్నాధం. టీజర్ తో సినిమా మీద అంచనాలను పెంచేసిన బన్ని బ్రాహ్మణ గెటప్ లో అదరగొట్టాడు. ఇక టీజర్ లో అదుర్స్ చారి గెటప్ లో కనిపించిన బన్ని తన మార్క్ కామెడీతో అలరిస్తాడని చెప్పొచ్చు. ఇక ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న మరో టాక్ ఏంటంటే కాంట్రాక్ట్ కిల్లర్ అయిన డిజె అగ్రహారం చేరి ఓ సీక్రెట్ ఆపరేషన్ చేస్తాడట. 

మరి కాంట్రాక్ట్ కిల్లర్ అనగానే మహేష్ నటించిన అతడు సినిమా గుర్తుకు రాక తప్పదు. సో అతడు ప్లస్ అదుర్స్ కలిసి మిక్స్ చేసి దువ్వాడ జగన్నాధం సినిమా చేస్తున్నారని టాక్. ఏది ఏమైనా టీజర్ తో తన సత్తా చాటిన బన్ని మరోసారి సరైన హిట్ అందుకుంటాడనడంలో సంధేహం లేదు. మే నెలలో అనుకున్న ఈ సినిమా జూన్ జులైలో వచ్చేట్టు ఉంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.