
సమ్మర్ జోరులో సినిమాల హడావిడి బాగానే ఉంది.. ఓ పక్క సమ్మర్ రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాల ట్రైలర్ టీజర్స్ హడావిడి చేస్తుంటే ఇప్పుడిప్పుడే సెట్స్ మీదకు వెళ్లిన సినిమాల జోష్ కూడా మొదలైంది. ఉగాది కానుకగా రాబోతున్న సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ సందడి చేయగా ఇక రెండు రోజుల్లో రానున్న శ్రీరామనవమికి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన సినిమా టైటిల్ లోగోని ఫ్యాన్స్ కు గిఫ్ట్ గా ఇస్తున్నారు.
జనతా గ్యారేజ్ తర్వాత ఎన్.టి.ఆర్ నటిస్తున్న సినిమా జై లవ కుశ. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లోగో ఏప్రియల్ 5 శ్రీరామనవమి రోజు ఉదయం రిలీజ్ చేయనున్నారట. ఈ విషయం స్వయంగా చిత్ర నిర్మాత కళ్యాణ్ రాం ఎనౌన్స్ చేయడం విశేషం. మరి టైటిల్ లోగోతో తారక్ ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తాడో చూడాలి.