
అక్కినేని అఖిల్ ఎట్టకేలకు తన సెకండ్ మూవీ స్టార్ట్ చేశాడు. విక్రం కుమార్ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున సినిమాను నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ముహుర్తం పెట్టేశారు. అంతేకాదు ఈరోజు నుండి అఖిల్ మూవీ రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేశారు కూడా.
ఇక ఈ సినిమా స్టార్టింగ్ రోజే నాగ్ సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాడు. విక్రం కుమార్ దర్శకత్వంలో వస్తున్న అఖిల్ మూవీ ట్రెండ్ సెట్ చేయడం గ్యారెంటీ అనంటున్నాడు నాగార్జున. ఇష్క్ నుండి 24వరకు సక్సెస్ ఫుల్ సినిమాలను తీసుకుంటున్న విక్రం కుమార్ అఖిల్ సినిమాతో కూడా అదే రేంజ్ సక్సెస్ అందుకుంటాడని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. 45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబడుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు.