మహేష్ ఫస్ట్ లుక్ ఆరోజేనా..!

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ త్వరలో రిలీజ్ అవనుందట. తమిళ సంవత్సరాది కానుకగా ఏప్రియల్ 14న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా టైటిల్ గా స్పైడర్ అని పెట్టబోతున్నారట. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. జూన్ 23న రంజాన్ సందర్భంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో తమిళంలో కూడా మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు మహేష్. అందుకే తెలుగు సంవత్సరాది ఉగాదికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయకుండా తమిళ ప్రేక్షకుల మనసు గెలుచుకునేందుకు ఈ నెల 14న రాబోతున్నాడట. మరి అంచనాలను పెంచేలా ఫస్ట్ లుక్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.