
మెగా పవర్ స్టార్ రాం చరణ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు కలిసి మల్టీస్టారర్ మూవీ చేస్తే ఎలా ఉంటుంది. అదే జరిగితే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులే ఉండవు. క్రేజీ కాంబినేషన్ అయిన ఈ మల్టీస్టారర్ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుందట. మెగా ఫ్యామిలీలో నుండి వచ్చిన ఈ ఇద్దరు హీరోలు ఎవరికి వారు తమ సత్తా చాటుతున్నారు.
ప్రస్తుతం ధ్రువ సక్సెస్ తో చరణ్, సరైనోడు సక్సెస్ అందుకుని డిజెగా రాబోతున్న అల్లు అర్జున్ ఇద్దరికి తగినట్టు ఓ కథ ఆలోచించాడట ఓ సీనియర్ డైరక్టర్. లైన్ నచ్చేయడంతో సినిమా టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడట. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా నిర్మిస్తారట. ఆ బ్యానర్లోనే చరణ్ అర్జున్ టైటిల్ రిజిస్టర్ అయ్యిందట.
ఇతకుముందు చరణ్ అర్జున్ కలిసి ఎవడు సినిమాలో నటించారు. సినిమా కలిసి చేసినా ఒకే పాత్రకు ఇద్దరు న్యాయం చేశారు. కాని ఇప్పుడు ఒకేసారి ఇద్దరు స్క్రీన్ మీద కనిపించేలా చూస్తున్నారట. మెగా ఫ్యాన్స్ లో ఇద్దరికి బీభత్సమైన క్రేజ్ ఉంది. మరి అలాంటి రాం చరణ్ అల్లు అర్జున్ కలిసి తీసే ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.