ప్రభాస్ టైటిల్ 'సాహో'..!

బహుబలితో నేషనల్ స్టార్ గా సూపర్ ఇమేజ్ సంపాదించిన ప్రభాస్ ఇప్పుడు బాహుబలి-2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతున్న బాహుబలి-2 మీద ఎన్ని అంచనాలున్నాయో అందరికి తెలిసిందే. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టాడు దర్శక ధీరుడు రాజమౌళి. 

ఈ సినిమా కోసం నాలుగేళ్లు కెరియర్ త్యాగం చేసిన ప్రభాస్ అంతకుమించిన క్రేజ్ తెచ్చుకోగలిగాడు. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా సుజిత్ డైరక్షన్ లో వస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది. తెలుగు తమిళ హింది భాషల్లో రాబోతున్న ఈ సినిమా టైటిల్ గా సాహో అని నిర్ణయించారట. ఇప్పటికే యువి క్రియేషన్స్ బ్యానర్లో ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారట. బాహుబలిలో వీరోచిత పోరాటాలు చేసిన ప్రభాస్ ఆల్రెడీ సినిమాలో సాహో సాంగ్ తో అలరించాడు. ఇప్పుడు అదే టైటిల్ తో సుజిత్ డైరక్షన్ లో సినిమా చేయబోతున్నాడు ప్రభాస్.