అఖిల్ టైటిల్ లో మహేష్..!

అక్కినేని యువ హీరో అఖిల్ విక్రం కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అఖిల్ సినిమా తర్వాత ఏడాదిన్నర పైగా గ్యాప్ తీసుకున్న అఖిల్ ఫైనల్ గా విక్రం చెప్పిన కథను ఓకే చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 45 కోట్ల దాకా ఉండొచ్చని అంటున్నారు.

ఇక సినిమా టైటిల్ గా జున్ను అని ప్రిఫర్ చేశారు. సినిమాలో హీరోయిన్ క్యారక్టర్ పేరు కావడం చేత విక్రం కుమార్ అది పెడదామని అనుకున్నారట. కాని ఆ టైటిల్ పై ప్రేక్షకుల నుండి నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో మళ్లీ సినిమా టైటిల్ మార్చారట. ప్రస్తుతం టైటిల్ 'ఎక్కడ ఎక్కడ ఉందో తారక'. ఈ టైటిల్ ఉంటే వెంటనే మహేష్ మురారి సినిమా గుర్తుకు రావడం కామనే. మహేష్ ను ప్రేక్షకులకు దగ్గర చేసిన మురారి సినిమాలోని ఆ సాంగ్ నే టైటిల్ గా పెట్టబోతున్నారట.   

మరి టైటిల్ చూస్తుంటే అఖిల్ హీరోయిన్ కోసం వెతికే ప్రేమకథ అని తెలుస్తుంది. ఏదైనా సరే విక్రం సినిమాలన్ని చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. హిట్ కోసం తపించిపోతున్న అఖిల్ కు మహేష్ బాబు టైటిల్ తో వస్తున్న ఈ సినిమా అయినా హిట్ కిక్ ఇస్తుందో లేదో చూడాలి.