
ఇప్పటికే రెండు క్రేజీ లవ్ స్టోరీలను నడిపిన కోలీవుడ్ భామ నయనతార ఈసారి మాత్రం తన లవర్ విఘ్నేష్ శివన్ తో సహజీవనం దాకా మ్యాటర్ వెళ్లిందని టాక్. అయితే కోలీవుడ్ మీడియా మాత్రం నయన్, విఘ్నేష్ లు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారని కూడా కన్ఫాం చేసింది. ఆధారాలు లేవు కాని ఆర్య సమాజ్ లో నయనతార పెళ్లి జరిగిందని అంటున్నారు.
ఇద్దరు కలిసే ఉండటంతో ఇక కోలీవుడ్ వాళ్లు కూడా వారిని పట్టించుకోలేదు. ఇక కెరియర్ లో ముదురు వయసులో సూపర్ ఫాం కొనసాగిస్తున్న నయనతార రీసెంట్ గా దాస్ రామస్వామి డైరక్షన్ లో వచ్చిన డోర అంచనాలను తల కిందులు చేసింది. సింగిల్ సిట్టింగ్ లో కథ ఓకే చేసిన నయనతార డోర మూవీ ఫ్లాప్ కు కారణమయ్యింది. ఇక తమ మ్యాటర్ పై ఓపెన్ అవ్వుదామని విఘ్నేష్ అంటున్నా నయన్ మాత్రం ఇంకొన్ని సినిమాల దాకా ఆగుదాం అంటుందట. పెళ్లైన హీరోయిన్స్ కు పారితోషికం డిమాండ్ ఉండదు అందుకే నయన్ తన మ్యారేజ్ ను ఇంకా సీక్రెట్ గా ఉంచుతుందట. మరి అమ్మడు ఆ విషయం ఎప్పుడు ఓపెన్ చేస్తుందో చూడాలి.