
కొణిదెల నిహారిక హీరోయిన్ గా చేస్తున్న మొదటి సినిమా, 'ఒక మనసు' సినిమా ఆడియో విడుదల రేపు జరగనుంది. మొదటి నుండి ఈ వేడుక కి అతిధుల ప్రస్తావన గంధరగోళంగానే ఉంది. మెగా స్టార్ చిరంజీవి ఈ వేడుకకి వస్తున్నట్లైతే ఈ పాటికే ఆ వార్త వానలా కురుస్తూనే ఉండేది. కాని అలాంటిదేమీ లేదు కాబట్టి చిరంజీవి ఈ ఆడియో వేడుకకి రావడం లేదు అనేది తెలిసిపోతుంది.
కూతురు కాబట్టి నాగబాబు, చెల్లి కాబట్టి వరుణ్ తేజ్ ఈ ఫంక్షన్ కి వస్తున్నారని స్పెషల్ గా చెప్పనక్కరలేదు. కాని మెగా హీరోల్లో ఇంకెవరు వస్తున్నారనేది ఇక్కడ తెలుసుకోవలసి ఉంది. ఎందుకంటే కేవలం నాగబాబు, వరుణ్ తేజ్ తో అయితే, ఫంక్షన్ లో సందడి లేకుండా, ఒక మామూలు చిన్న సినిమా ఆడియో వేడుక లాగే చప్పగా ఉంటుంది.
ఆ పరిస్థితి ఉండకూడదనే అల్లు అర్జున్ ఒక మనసు ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి వస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్ కూడా వస్తున్నాడని ముందు అనుకున్నా ప్రస్తుతానికి అఫీషియల్ గా ఎటువంటి సమాచారం లేదు.