
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న జైలవకుశ సినిమా బాబి డైరక్షన్ లో వస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్న తారక్ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తాడట. ఇప్పటికే సినిమాలో ఒక హీరోయిన్ గా రాశి ఖన్నా సెలెక్ట్ అవగా సెకండ్ హీరోయిన్ ఛాన్స్ నివేదా థామస్ కొట్టేసిందని టాక్. ఇక థర్డ్ హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారు చిత్రయూనిట్.
తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆ ఛాన్స్ మళ్లీ సమంతకే దక్కిందని అంటున్నారు. బృందావనం సినిమా నుండి హిట్ పెయిర్ గా నిలిచిన తారక్, సమంత లాస్ట్ ఇయర్ కలిసి నటించిన జనతా గ్యారేజ్ కూడా సూపర్ హిట్ అందుకున్నారు. ఆ సెంటిమెంట్ తోనే ఇప్పుడు జై లవకుశలో కూడా సమంతకే ఓటేస్తున్నాడట జూనియర్. క్రేజీ జంటగా ఏర్పడ్డ ఈ జంట మరోసారి కలిసి నటించడం ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.