పెళ్లిచూపులు డైరక్టర్ ఫైర్ మీదున్నాడు

లాస్ట్ ఇయర్ సూపర్ హిట్ మూవీస్ లో టాప్ రేంజ్ లో ఉండే సినిమా అంటే కచ్చితంగా పెళ్లి చూపులు కూడా వస్తుంది. ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమా ఏ రేంజ్ హిట్ సాధించిందో తెలిసిందే. ఇక్కడే కాదు ఓవర్సీస్ లో ఏకంగా 50 డేస్ ఆడిన సినిమాగా చరిత్ర సృష్టించింది. అయితే ప్రేక్షకులు ఇచ్చే అవార్డులే సినిమాకు కావాల్సింది కాని అందరిని ప్రోత్సహించడానికి ఇచ్చే అవార్డులు కావాలనుకుంటారు.

రీసెంట్ గా జరిగిన ఐఫా 2017 ఉత్సవంలో పెళ్లిచూపులు సినిమాకు కేవలం బెస్ట్ కమెడియన్ అవార్డ్ మాత్రమే వచ్చింది దీనిపై స్పందించిన పెళ్లిచూపులు డైరక్టర్ తరుణ్ భాస్కర్ అవార్డులు కేవలం టివి ఛానెల్స్ డబ్బు సంపాదించడానికే అని అన్నారు. టాలెంటెడ్ టెక్నిషియన్స్ ను ఎంకరేజ్ చేయడానికి అవార్డులు కాదని కేవలం స్టార్ హీరోలకే సినిమాలకే అవార్డులు వస్తాయని అన్నారు. ఎవరెలా ఉన్నా తాను మాత్రం స్టార్ హీరోల ఉచ్చులో పడనని.. తన మార్క్ సినిమాలనే తీసుకుంటూ వెళ్తానని ఫేస్ బుక్ లో ఓ లెటర్ పోస్ట్ చేశాడు తరుణ్ భాస్కర్. అవార్డ్ వేడుకల్లో పెళ్లిచూపులు సినిమాను గుర్తించకపోవడం కాస్త ఆలోచించాల్సిన విషయమే.