
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఐఫా ఉత్సవంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు టాలీవుడ్ లో నూతన ఉత్సాహాన్ని తీసుకు వస్తున్నాయి. ఐఫా ఉత్సవంలో బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ గెలుచుకున్న తారక్ ఈ అవార్డ్ తనకు మాత్రమే కాదు నామినీకి సెలెక్ట్ అయిన హీరోలందరిది అన్నాడు తారక్. అంతేనా రానా చేసిన స్మాల్ ఇంటర్వ్యూలో సర్ ప్రైజింగ్ ఆన్సర్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు జూనియర్.
టాలీవుడ్ లో అందగాడు ఎవరని అడిగిన రానా ప్రశ్నకు వెంటనే మహేష్ అని సమాధానమిచ్చాడు తారక్. ఇక నటుడిగా నాని అంటే ఇష్టమని.. వాయిస్ పరంగా రానా దగ్గుబాటి ఇష్టమని అన్నాడు ఎన్.టి.ఆర్. కేవలం అవార్డ్ తీసుకున్నామా వెళ్లామా అన్నట్టు కాకుండా సాటి హీరోల గురించి పొగడటం ఎన్.టి.ఆర్ కే చెల్లింది. తన మంచి హృదయంతో తన అభిమానులనే కాదు సిని ప్రియులను కూడా విశేషంగా ఆకట్టుకున్నాడు తారక్.