
మలయాళం నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా రేసులో ఉన్న కీర్తి పవర్ స్టార్ త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ మూవీలో సెలెక్ట్ అయ్యింది. ఇక మరో పక్క మహానటి సావిత్రి బయోపిక్ గా వస్తున్న మహానటి మూవీలో కూడా కీర్తి సావిత్రిగా నటిస్తుంది.
ఈ సినిమా కోసం ఎంతోమంది భామలను టెస్ట్ చేసిన కీర్తిని సెలెక్ట్ చేశారు. ఇక సినిమా కోసం ఎక్కువ రోజులు డేట్స్ అవసరం పడగా దాని కోసం ఆమెకు దాదాపు 3 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారట. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న మహానటి సినిమా నాగ అశ్విన్ డైరక్షన్ లో వస్తుంది. అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమా చాలా ప్రెస్టిజియస్ గా తెరకెక్కిస్తున్నారు. మహానటి కోసం 3 కోట్లు తీసుకున్న కీర్తి తనదగ్గరకు వస్తున్న దర్శక నిర్మాతలకు అదే రేంజ్ రెమ్యునరేషన్ చెప్పి షాక్ ఇస్తుందట.