రూమర్స్ కు చెక్ పెట్టిన శంకర్..!

క్రేజీ డైరక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజినికాంత్ కాంబినేషన్ లో రోబో సీక్వల్ గా 2.0 వస్తున్న సంగతి తెలిసిందే. ప్యాచ్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి వస్తున్న రూమర్స్ పై సినిమా డైరక్టర్ శంకర్ స్పందించారు. సినిమాలో రజిని ఐదు రకాల పాత్రలుంటాయని.. అక్షయ్ కుమార్ ఏకంగా 12 గెటప్ లలో కనిపిస్తాడని తాజా రూమర్. అయితే ఈ న్యూస్ ఆనోటా ఈ నోటా పడి శంకర్ దాకా వెళ్లింది.

ఇక దీనికి స్పదించిన శంకర్ సినిమా గురించి వస్తున్న వార్తలన్ని నిజం కాదని. సినిమా అప్డేట్స్ అన్ని తమ నుండే స్వయంగా రివీల్ చేస్తామని అన్నారు. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 2017 దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా బడ్జెట్ 400 కోట్ల దాకా పెడుతున్నారట. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినికి విలన్ గా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.