
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ సినిమా మీద అభిమానులు ఆగ్రహం మహేష్ దాకా చేరింది. సినిమా మొదలు పెట్టి చాన్నాళ్లు అవుతున్నా ఇంతవరకు సినిమా నుండి ఎలాంటి పోస్టర్ రిలీజ్ చేయకపోవడంతో ఫ్యాన్స్ అప్సెట్ లో ఉన్నారు. ఇక ఫ్యాన్స్ ఆగ్రహ జ్వాలలు తెలుసుకున్న మహేష్ స్వయంగా సినిమా టీజర్ గురించి ట్వీట్ చేయడం జరిగింది.
తన అభిమానులు సినిమా టీజర్ గురించి ఎంత ఎగర్ గా వెయిట్ చేస్తున్నారో తనకు తెలుసని త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామని అప్పటిదాకా కాస్త ఓపిక పట్టండని మహేష్ ఫ్యాన్స్ అందరిని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వియత్నంలో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రయూనిట్ ఏప్రిల్ 2న తిరిగి హైదరాబాద్ వస్తుందట. ఆ తర్వాత టీజర్ రిలీజ్ చేసే అవకాశాలున్నాయట. ఏప్రిల్ 10లోపే మహేష్ మురుగదాస్ టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.