మణిశర్మ ఈజ్ బ్యాక్..!

దశాబ్ధం క్రితం తెలుగులో ఏ స్టార్ హీరో సినిమా అయినా మ్యూజిక్ ఎవరు అని చూస్తే మణిశర్మ పేరు కనబడుతుంది. తన పాటల సందడితో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న మణిశర్మ ఈమధ్య సినిమాలను పూర్తిగా తగ్గించాడు. వచ్చిన అరకొర అవాకాశలను చేస్తూ కాలం గడుపుతున్న మణిశర్మ కొన్ని సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తూ వస్తున్నాడు.    

చాలారోజుల తర్వాత జెంటిల్మన్ సినిమాకు క్రేజీ మ్యూజిక్ అందించిన మణిశర్మ ఆ సినిమా హిట్ లో తాను భాగమయ్యాడు. నాని హీరోగా వచ్చిన జెంటిల్మన్ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టాడు మణిశర్మ. ప్రస్తుతం హను రాఘవపుడి డైరక్షన్ లో నితిన్ హీరోగా వస్తున్న సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు మణి. ఈరోజు నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. లై అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ కు మణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ట్రెండీగా స్టైలిష్ గా ఉన్న ఈ బిట్ మ్యూజిక్ చూస్తుంటే మణిశర్మ ఈజ్ బ్యాక్ అనిపిస్తుంది. మరి అనుకున్న రేంజ్ లో సినిమా మ్యూజిక్ తో మణిశర్మ అలరిస్తాడో లేదో చూడాలి.