
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ గా కాటమరాయుడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రం సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఏప్రిల్ 6 నుండి సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. ఇక ఈ సినిమా తర్వాత అసలైతే నీశన్ డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉన్నా అది అటకెక్కేసిందని తెలుస్తుంది.
ఇక దాని బదులు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో సినిమా చేయబోతున్నాడట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమా కోసం దాదాపు పవన్ కు 40 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాకు పవన్ కేవలం 40 రోజులు మాత్రమే డేట్స్ ఇస్తున్నాడట. సో ఈ లెక్కన పవన్ రోజుకి కోటి రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడన్నమాట. ఇప్పటిదాకా 20కి అటు ఇటు ఉన్న పవర్ స్టార్ ఇప్పుడు ఏకంగా 40 కోట్లు అంటే సౌత్ ఇండియాలోనే కాదు ఇండియన్ సినిమాలోనే ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకునే క్రేజీ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పొచ్చు.
ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియదు కాని సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో పవర్ స్టార్ సినిమా తీసేందుకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. మరి పవన్ రెమ్యునరేషన్ ఈ రేంజ్ లో ఉంటే సినిమా బడ్జెట్ ఇంకే రేంజ్లో ఉంటుందో చూడాలి.