
స్టార్ హీరో, చిన్న హీరో ఎవరైనా సరే అవార్డ్ వచ్చిందంటే అది కచ్చితంగా గొప్ప విషయమని చెప్పొచ్చు. తాజాగా ఐఫా 2016 వేడుక జరిగింది. బెస్ట్ యాక్టర్ కేటగిరిలో ఎంతోమంది పోటీ పడగా.. ఫైనల్ గా ఆ అవార్డ్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కైవసం చేసుకున్నారు. జనతా గ్యారేజ్ సినిమాకు తారక్ ఈ అవార్డ్ అందుకున్నారు. అవార్డ్ అందుకోవడం ఒక విషయమైతే మైక్ అందుకున్న తారక్ తన మాటలతో అందరి మనసులను గెలుచుకున్నాడు.
ఎవరైనా అవార్డ్ వస్తే కేవలం తన సినిమా గురించి చెప్పడం కామన్ కాని అవార్డ్ కోసం నామిని అయిన అందరి పేర్లను చదివి.. అందరు అద్భుతంగా నటించారని.. అయితే ఈ అవార్డ్ తన ఒక్కడిదే కాదని అందరిది అని చెప్పాడు తారక్. కెరియర్ లో ఆటు పోట్లను ఎదుర్కున్న ఎన్.టి.ఆర్ మళ్లీ తన ఇదవరకు ఫాంలోకి వచ్చాడు. ఐఫా అవార్డ్ వేడుకల్లో తారక్ మాటలని విన్న ప్రతి ఒక్కరు తన మీద అభిమానం పెంచుకున్నారు.